Skip to main content

Namaste NRI

తెలుగువారికి కూడా సినిమా నచ్చుతుంది

మలయాళం బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన యువతరం సినిమా వాలా 2. హరీష్‌.హెచ్‌, అలన్‌ బిన్‌ సిరాజ్‌, అజిన్‌ జాయ్‌, వినాయక్‌.వి తదితర యువనటీనటులు నటించిన ఈచిత్రానికి సావిన్‌ ఎస్‌ఏ దర్శకుడు. సాహు గారపాటి తన షైన్‌ స్క్రీన్‌ పతాకంపై విపిన్‌దాస్‌, హారిస్‌ దేశం, పీబీ అనిష్‌, ఆదర్శ్‌ నారాయణ్‌లతో కలిసి ఈ మలయాళ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఇప్పటికే 200కోట్ల వసూళ్లను సాధించి, ఇంకా విజయవంతంగా ప్రదర్శితమవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను అదే పేరుతో ఈ నెల 24న శుక్రవారం తెలుగులో విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో సూపర్‌హీరో తేజ సజ్జా, దర్శకుడు మలినేని గోపీచంద్‌ ముఖ్య అతిథులుగా హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. మలయాళంలో తన తొలి ప్రయత్నం ఇంతటి విజయాన్ని సాధించడం చాలా ఆనందంగా ఉందని, డైరెక్టర్‌ సినిమాను అద్భుతంగా తీశాడని, తెలుగువారికి కూడా సినిమా నచ్చుతుందని నిర్మాత సాహు గారపాటి నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా చిత్రబృందమంతా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News