Namaste NRI

యువ క్రీడా ప్రతిభను చాటిన తానా టి7 కిడ్స్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) క్రికెట్‌ పోటీల్లో యువ క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో తానా టి7 కిడ్స్‌ టోర్నమెంట్‌ను ఏర్పాటు చేసింది. ఆగస్టు 24వ తేదీన నార్త్‌ కరోలినాలోని కన్‌కోర్డ్‌లో ఉన్న కెజిఎఫ్‌ గ్రౌండ్‌లో ఈ పోటీలు జరిగాయి. రెండు విభాగాల్లో ఈ పోటీలు జరిగాయి. 9,10,11 వయస్సుకల వారికి, 12,13,14 వయస్సు కల పిల్లలకు విడివిడిగా పోటీలను నిర్వహించింది. ఈ పోటీలకు ఎంట్రీ ఫీజుగా 100 డాలర్ల ను నిర్ణయించింది. విజేతలకు 200 డాలర్లు, రన్నర్‌కు 150 డాలర్ల క్యాష్‌ ప్రైజ్‌ ఇస్తున్నట్లు ప్రకటించింది.

e3831e00 0b5a 4222 a05a cb42e2864b2b

ఈ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు ఎంతోమంది యువ క్రీడాకారులు ఉత్సాహం చూపించారు. వారి క్రీడా ప్రతిభ అందరినీ ఆకట్టుకుంది. వివిధ చోట్ల ఉన్న యువ క్రికెట్‌ క్రీడాకారులంతా తానా జెర్సీలతో ఆడుతూ ఉంటే వచ్చినవారు చప్పట్లతో వారిని ఉత్సాహపరచడం విశేషం. గ్రౌండ్ ని తానా క్రీడల జెండాలుతో అలంకరించటం విశేషం. ఛార్లెట్‌లో మొదటిసారిగా ఇలాంటి పోటీలను నిర్వహించినందుకు నిర్వాహకులను అందరూ అభినందించారు.

c636537c abed 49be 8edd 410aae67cc7e

తానా స్పోర్ట్స్‌ కో ఆర్డినేటర్‌ నాగ పంచుమర్తి ఆధ్వర్యంలో తానా ఇంటర్నేషనల్‌ కో ఆర్డినేటర్‌ టాగూర్‌ మల్లినేని, తానా టీమ్‌ స్క్వేర్‌ చైర్‌ కిరణ్‌ కొత్తపల్లి, పట్టాభి కంటమనేని, అన్నె రమణ, వలంటీర్లు వెంకీ అడుసుమిల్లి, చందు బచ్చు, గోపి పాములపాటి, రఘు వీరమాచనేని, శ్రీధర్‌ నాగు బోయిన, సతీష్‌ నాగ భైరవ, సాయి కిలారు, వెంకట క్రిష్ణ తదితరులు ఈ పోటీల విజయవంతానికి కృషి చేశారు.

3a5769af e43f 48a3 9a3f 02a0f0cd6d6d
50e409c6 592a 4e9f 922f 2a94141522d8 108
555bcf77 2d3f 47eb 9169 4b7001708f54
f8900b5f 232d 4ed0 9e9a f342ae9bc1c6 114
b03ab469 f7d5 4f0d b8d5 69a01543ac46
Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events