ట్విటర్ సంస్థను కొనుగోలు చేయనున్నట్లు బిలియనీర్ ఎలన్ మస్క్ ప్రకటించారు.సుమారు 44 బిలియన్ల డాలర్లకు దాన్ని ఆయన సొంతం చేసుకోవాలనుకున్నారు. అయితే ఆ డీల్ నుంచి తప్పుకున్నారు. ట్విట్టర్‌తో అగ్రిమెంట్ సరైన రీతిలో లేదని ఆరోపించారు. స్పామ్, ఫేక్ అకౌంట్లపై సమగ్రమైన సమాచారాన్ని ట్విట్టర్ ఇవ్వలేకపోయిందని, అందుకే ఆ ఒప్పందం నుంచి వైదొలుగున్నట్లు తెలిపారు. ట్విటర్‌ను ఖరీదు చేయనున్నట్లు ఏప్రిల్‌లో మస్క్ వెల్లడిరచిన విషయం తెలిసిందే. కానీ అప్పటి నుంచి ఆ భారీ ఒప్పందంపై రకరకాల అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే మస్క్ నిర్ణయంపై ట్విటర్ స్పందించింది. మస్క్‌పై న్యాయపమరైన చర్యలు తీసుకోనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. మస్క్ అంగీకరించిన ధరకు, షరతులకు లోబడే కట్టుబడి ఉన్నామని ట్విటర్ బోర్డ్ చైర్మెన్ బ్రెట్ టేలర్ తెలిపారు.




























