Namaste NRI

ఆ కోరిక ఈ సినిమాతో తీరింది : రాజ్‌తరుణ్‌

రాజ్‌ తరుణ్‌ హీరోగా రూపొందిన చిత్రం భలే ఉన్నాడే. జె.శివసాయివర్ధన్‌ దర్శకుడు. ఎన్వీ కిరణ్‌కుమార్‌ నిర్మాత. అగ్రనిర్మాత మారుతి సమర్పకుడు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాజ్‌తరుణ్‌ మాట్లాడారు. ఇది కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. కథలో చాలామంచి ఎమోషన్స్‌ ఉంటాయి. దర్శకుడు శివసాయి నేను పనిచేసిన దర్శకుల్లో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ డైరెక్టర్‌. తాను ఈ సినిమాను మలచిన తీరు అద్భుతం. దర్శకుడి విజన్‌కి తగ్గట్టు నిర్మాత కూడా సహకరించడం వల్లే సినిమా బాగా వచ్చింది. కథానాయిక మనీషా కంద్కూర్‌ చక్కగా పెర్ఫార్మ్‌ చేసింది. శేఖర్‌చంద్ర బ్యూటిఫుల్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. మారుతీగారితో ఎప్పట్నుంచో పనిచేయాలని ఉండేది. ఆ కోరిక ఈ సినిమాతో తీరింది. అందరూ కలిసి చూడదగ్గ సినిమా ఇది అని అన్నారు.

50e409c6 592a 4e9f 922f 2a94141522d8 112

అమ్మాయిలకు చీరకట్టే వాళ్లను శారీ డ్రాపర్స్‌ అంటారు. ఇందులో రాజ్‌తరుణ్‌ శారీ డ్రాపర్‌గా నటించారు. అమ్మాయిలకి చీరకట్టాలంటే ఓ కంఫర్ట్‌బుల్‌ లెవల్‌ ఉండాలి. దాని ప్రకారం రాజ్‌తరుణ్‌ లుక్‌నీ, బిహేవియర్‌ ని డిజైన్‌ చేశా. తను ఎందుకలా ఉన్నాడనేది సెప్టెంబర్‌ 7న తెరపై చూస్తారు అని దర్శకుడు చెప్పారు. ఇంకా కథానాయిక మనీషా కంద్కూర్‌, నిర్మాత కిరణ్‌కుమార్‌, సంగీత దర్శకుడు శేఖర్‌చంద్ర కూడా మాట్లాడారు. సెప్టెంబర్‌ 7న సినిమా విడుదల కానుంది.

f8900b5f 232d 4ed0 9e9a f342ae9bc1c6 118
Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events