Skip to main content

Namaste NRI

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై జీవోలను ఆన్‌లైన్‌లో పెట్టవద్దని నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జీవోలను ఆఫ్‌ లైన్‌లోనే పెట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది. ఈ అంశంపై అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు సమాచారం అందించింది. ఇటీవల బ్లాంక్‌ జీవోల జారీ వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పొరుగు రాష్ట్రాల విధానాలను అనుసరించాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో పబ్లిక్‌ డొమైన్లలో ఇకపై ఏపీ ప్రభుత్వం ఉత్వరులు కనిపించవు.  2008 లో వైఎస్‌ హయాం నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రజల కోసం జీవోలను ఆన్‌లైన్‌లో ఉంచుతోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events