సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య తనయుడు అనంత కిషోర్ నిర్మాతగా రూపొందిస్తున్న తొలిచిత్రం తల్లి మనసు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. వి.శ్రీనివాస్ (సిప్పీ) దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రచిత మహాలక్ష్మి, కమల్‌కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రధారులు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత పోకూరి బాబురావు క్లాప్‌నివ్వగా, ఏషియన్‌గ్రూప్ భరత్ నారంగ్ కెమెరా స్విఛాన్ చేశారు. టైటిల్‌ను బట్టి ఎంత మంచి సబ్జెక్ట్‌తో సినిమా చేస్తున్నామో అర్థం చేసుకోవచ్చని, తల్లి పాత్రలో రచిత నటిస్తున్నారని ముత్యాల సుబ్బయ్య తెలిపారు. మధ్యతరగతి తల్లి మనోవేదన, సంఘర్షణకు దృశ్యరూపంగా ఉంటుందని దర్శకుడు వి.శ్రీనివాస్ పేర్కొన్నారు. యాభైరోజుల పాటు జరిగే సింగిల్ షెడ్యూల్‌లో చిత్రాన్ని పూర్తి చేస్తామని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: నివాస్, సంగీతం: కోటి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.శ్రీనివాస్.