Namaste NRI

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి రొమాంటిక్ మెలోడీ మొదటి చినుకు సాంగ్ రిలీజ్

ప్రదీప్‌ మాచిరాజు హీరోగా నటిస్తున్న చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. దీపికా పిల్లి కథానాయిక.  నితిన్‌-భరత్‌ దర్శకత్వం.  మాంక్స్‌ అండ్‌ మంకీస్‌ సంస్థ నిర్మిస్తున్నది. ఈ సినిమాలోని మొదటి చినుకు  అనే మూడో పాటను విడుదల చేశారు. రథన్‌ స్వరపరచిన ఈ పాటను చంద్రబోస్‌ రచించారు. గ్రామీణ నేపథ్యంలో చిత్రీకరించిన ఈ పాట తొలి ప్రేమలోని జ్ఞాపకాలను ఆవిష్కరిస్తూ సాగింది. సిధ్‌శ్రీరామ్‌ గాత్రం హైలైట్‌గా నిలిచింది. మ్యూజికల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఇదని చిత్ర బృందం పేర్కొంది. వెన్నెల కిషోర్‌, సత్య, గెటప్‌ శ్రీను, మురళీధర్‌ గౌడ్‌ తదితరులు నటిస్తున్నారు.  ఏప్రిల్‌ 11న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: రథన్‌, కథ, మాటలు: సందీప్‌ బొల్లా, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నితిన్‌-భరత్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events