అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి భారతీయ అమెరికన్‌కు ఉన్నత స్థానం కల్పించారు. దౌత్యవేత్త రిచర్డ్ వర్మను అమెరికా విదేశాంగ శాఖలో అత్యున్నత దౌత్య స్థానానికి బైడెన్ నామినేట్ చేశారు. ఈ మేరకు అధ్యక్ష కార్యాలయం రిచర్డ్ వర్మ నామినేషన్‌ను ప్రకటించింది. వైట్‌హౌస్ ధ్రువీకరణ ప్రకారం ఆయన మేనేజిమెంట్ అండ్ రిసోర్సెస్‌కు డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తారు. ఇది స్టేట్ డిపార్ట్‌మెంట్‌లో అత్యున్నత ర్యాంక్. 54 ఏండ్ల వర్మ ప్రస్తుతం మాస్టర్ కార్డ్‌లో చీఫ్ లీగల్ ఆఫీసర్ అండ్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ హెడ్‌గా ఉన్నారు. 2015 జనవరి 16 నుంచి 2017 జనవరి 20 వరకు భారత్‌లో అమెరికా రాయబారిగా పని చేశారు. ఒరాక్ ఒబామా హయాంలో లెజిస్టేటివ్ వ్యవహారాల సహాయ కార్యదర్శిగా కూడా రిచర్డ్ వర్మ పని చేశారు. వర్మ తన కెరీర్‌లో ముందుగా యునైటెడ్ స్టేట్స్ సెనేటర్ హ్యారీ రీడ్‌కి జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నారు.














