Namaste NRI

రాజాసాబ్‌ టీజర్‌ వచ్చేది ఆరోజే

మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న హారర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ రాజాసాబ్‌.  జూలైలో విడుదల చేసిన గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ప్రభాస్‌ రొమాంటిక్‌ లుక్స్‌తో ఫిదా చేశారు. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ బయటికొచ్చింది. ప్రభాస్‌ జన్మదినమైన అక్టోబర్‌ 23న టీజర్‌ను విడుదల చేస్తారని వార్తలొస్తున్నాయి. ఏప్రిల్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం రాజాసాబ్‌ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతున్నది. ప్రభాస్‌ తన షూటింగ్‌ పార్ట్‌ను ఇప్పటికే పూర్తి చేశారు. తాజా షెడ్యూల్‌లో ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

Social Share Spread Message

Latest News