Namaste NRI

యూఏఈ ప్రభుత్వం కీలక నిర్ణయం… నవంబర్ 10 వరకు వీసాల గడుపు పెంపు

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) నుంచి సెలవులపై ఇంటికి వచ్చి, ఇక్కడే చిక్కుకుపోయిన వారికి వీసాల గడువును నవంబర్‌ 10 వరకు పెంచుతూ అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మన దేశంతో పాటు పాకిస్థాన్‌, నేపాల్‌, శ్రీలంక తదితర దేశాల వలస కార్మికులకు ఎంతో మేలు కలుగనుంది. యూఏఈలోని దుబాయ్‌, అబుదాబి, షార్జా తదితర ప్రాంతాల్లోని వాణిజ్య సంస్థలు, కంపెనీల్లో పనిచేస్తున్న వారు గతంలో సెలవులపై సొంతూళ్లకు చేరుకున్నారు. ఏప్రిల్‌ 20 నుంచి నవంబర్‌ 9 లోపు గడువు ముగిసే వీసాలను పొడిగించింది. ఈ మేరకు దుబాయ్‌ జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెసిడెన్స్‌, ఫారెన్‌ ఎఫైర్స్‌  నిర్ణయం తీసుకుంది.

Social Share Spread Message

Latest News