Namaste NRI

శరవేగంగా విశ్వంభర.. లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఇదే

చిరంజీవి నటిస్తున్న చిత్రం  విశ్వంభర. త్రిష, అషికా రంగనాథ్‌ కథానాయికలుగా.  ఈ సినిమాపై ఆడియన్స్‌ లో అంచనాలు ఓ స్థాయిలో ఉన్నాయి. జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నది. కథాపరంగా ఈ సినిమాకు వీఎఫ్‌ఎక్స్‌ చాలా అవసరం. అందుకే అత్యున్నత స్థాయిలో విజువల్‌ ఎఫెక్ట్స్‌తో ఈ సినిమాను దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్నారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌కు కూడా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉండటంతో ఓవైపు ప్రొడక్షన్‌నూ, మరోవైపు పోస్ట్‌ప్రొడక్షన్‌నూ ఏకకాలంలో కొనసాగిస్తున్నారు.

తాజాగా మేకర్స్‌ ఈ సినిమా డబ్బింగ్‌ పనులను కూడా మొదలుపెట్టారు. ప్రతిష్టాత్మక యూవీక్రియేషన్స్‌ పతాకంపై విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి ఆంజనేయభక్తుడిగా కనిపించను న్నారు. ఇందులో యాక్షన్‌ సీక్వెన్స్‌ కూడా అద్భుతంగా ఉంటాయని, తెరపై కొత్త చిరంజీవిని చూస్తారని దర్శకుడు వశిష్ట చెబుతున్నారు. ఈ చిత్రంలో కునాల్‌ కపూర్‌ పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు, సంగీతం: ఎం.ఎం.కీరవాణి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress