Skip to main content

Namaste NRI

ది వాక్సిన్‌ వార్‌ ట్రైలర్‌ అప్‌డేట్‌

 కొవిడ్‌ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడడానికి వ్యాక్సిన్‌ను తయారు చేసిన భారతీయ శాస్త్రవేత్తల నిజమైన కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ది వ్యాక్సిన్‌ వార్‌.  వివేక్‌ రంజన్‌ అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ది కశ్మీర్‌ ఫైల్‌ చిత్రం తరవాత వివేక్‌ నుంచి వస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అనుపమ్‌ ఖేర్‌, నానా పటేకర్‌, పల్లవి జోషి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ అప్‌డేట్‌ను ప్రకటించారు. ఏ సమయంలోనైనా ట్రైలర్‌ రావచ్చొంటూ ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. టైమ్‌ అని ఏం మెన్సన్ చేయలేదు కానీ.. ఈ రోజు అర్ధరాత్రి వరకు ఎప్పుడైనా వచ్చే చాన్స్‌ ఉందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో దాదాపుగా కశ్మీర్‌ ఫైల్స్‌ టీమ్‌నే తీసుకున్నారు. ది కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాను నిర్మించిన పల్లవి జోషినే ఈ సినిమాను కూడా నిర్మిస్తుంది. ఇక ఈ సినిమా సెప్టెంబర్‌ 28న పాన్‌ ఇండియా లెవల్లో రిలీజ్‌ కాబోతుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events