Skip to main content

Namaste NRI

ఇండో -గల్ఫ్‌ త్రోబాల్‌ టోర్నమెంట్‌ విజేతగా.. అమెరికా టీమ్‌

బహ్రెయిన్‌లో అంతర్జాతీయ త్రోబాల్‌ సమాఖ్య ఆధ్వర్యంలో  నిర్వహించిన ఇండో`గల్ఫ్‌ ఇంటర్నేషనల్‌ త్రోబాల్‌ ఛాంపియన్‌షిప్‌ లో అమెరికాకు చెందిన మహిళల జట్టు స్పోర్టీ దివాస్‌ విజేతగా నిలిచింది. ఇది ఇండియన్‌ క్లబ్‌ బహ్రెయిన్‌ భాగస్వామ్యంతో కలిసి నిర్వహించారు.  ఈ టోర్నమెంట్‌లో బహ్రెయిన్‌ నుంచి నాలుగు, అమెరికా, భారత్‌, సౌదీ నుంచి ఒక్కో టీమ్‌ పోటీపడ్డాయి. సెమీ ఫైనల్‌లో సౌదీపై విజయం సాధించిన అమెరికా జట్టు ఫైనల్‌లో భారత్‌పై గెలుపొంది ఛాంపియన్‌షిప్‌  విజేతగా నిలిచింది.

తానా  సెక్రటరీ రాజా కసుకుర్తి, తానా స్పోర్ట్స్‌ కో ఆర్డినేటర్‌ నాగ పంచుమర్తి, తానా ఇంటర్నేషనల్‌ కో ఆర్డినేటర్‌ ఠాగూర్‌ మల్లినేనిలు ఈ టీమ్‌కు స్పాన్సర్‌ చేశారు. తమను ప్రోత్సహించిన తానా నేతలకు, కుటుంబ సభ్యులకు విజేత జట్టు ధన్యవాదాలు తెలిపింది. అమెరికా స్పోర్టీ దివాస్‌ జట్టులో వసంత కావూరి, కావ్య వుర్రాకుల, నిత్య సౌందరరాజన్‌, శబ్నం శంషుద్దీన్‌, సాయి లక్ష్మి గార్లపాటి, స్పజన కుంచి గౌతమి యలవర్తి ఉన్నారు. 

Social Share Spread Message

Latest News