Skip to main content

Namaste NRI

వెళ్లేముందు మరోసారి ఆలోచించండి .. అమెరికా హెచ్చరిక

మధ్యప్రాచ్యంలో రోజురోజుకూ తీవ్రతర మవుతున్న భద్రతా పరిస్థితుల నేపథ్యంలో అమెరికా తమ దేశ పౌరులకు తాజా ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్‌-అమెరికా మధ్య కొనసాగుతున్న సైనిక ఘర్షణలు ఎప్పుడైనా మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని పేర్కొంటూ, మధ్యప్రాచ్య దేశాలకు లేదా ఆ ప్రాంతం మీదుగా ప్రయాణించాలనుకునే అమెరికన్లు తమ నిర్ణయాన్ని పున:పరిశీలించాలని అమెరికా విదేశాంగ శాఖ సూచించింది.
మధ్యప్రాచ్య ప్రాంతంలో భద్రతా పరిస్థితులు అత్యంత సంక్లిష్టంగా మారాయని పేర్కొంది. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా ఎలాంటి హెచ్చరిక లేకుండానే పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉందని తెలిపింది.

మధ్యప్రాచ్యంలో ప్రస్తుతం ఉన్న అమెరికా పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలనీ, తాజా పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ స్థానిక అధికారుల సూచనలను పాటించాలని విదేశాంగ శాఖ సూచించింది. అలాగే వాణిజ్య విమాన సర్వీసుల్లో ఆకస్మిక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున, ప్రయాణికులు తమ విమానాలు యథావిధిగా నడుస్తున్నాయో లేదో సంబంధిత విమానయాన సంస్థలతో ముందుగానే నిర్ధారించుకోవాలని పేర్కొంది.

Social Share Spread Message

Latest News