రాజ్‌తరుణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భలే ఉన్నాడే. జె.శివసాయి వర్ధన్ దర్శకత్వం. ఈ చిత్రాన్ని ఎన్.వి.కిరణ్ నిర్మిస్తున్నారు. దర్శకుడు మారుతి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. బుధవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఎప్పుడో వచ్చిన తన ఆలోచనను దర్శకుడు శివసాయికి చెబితే, దానిని అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చాడని, ఫ్యామిలీస్ అందరూ చూసి ఆనందించే చిత్రమిదని మారుతి అన్నారు.
ఆద్యంతం వినోదభరితంగా సాగే చిత్రమిదని హీరో రాజ్‌తరుణ్ తెలిపారు. రెండున్నర గంటలు హాయిగా నవ్వుకొని థియేటర్ నుంచి బయటకొస్తారని, ఎమోషనల్‌గా కూడా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందని దర్శకుడు శివసాయివర్ధన్ పేర్కొన్నారు. ఈ సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నామని నిర్మాత కిరణ్ కుమార్ తెలిపారు. ఈ 13న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.