Skip to main content

Namaste NRI

ఇది కల్వకుంట్ల సమస్య కాదు.. రైతులది : కిషన్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు ధాన్యం సేకరణ చేపట్టాలని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. బీజేపీ కార్యాలయంలో కిషన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇది కల్వకుంట్ల కుటుంబ సమస్య కాదని, రైతుల సమస్య అని అన్నారు. రైతు వ్యతిరేక ప్రభుత్వమని కేంద్రాన్ని నిందించేందుకు ముఖ్యమంత్రికి నోరెలా వచ్చిందన్నారు. హుజూరాబాద్‌ ఫలితానికా? అక్కడి ప్రజలు, రైతుల మీద వ్యతిరేకతతో ధర్నాలు చేస్తున్నారా? ప్రశ్నించారు. ఉద్యోగాల భర్తీ, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ,  ఎస్టీలకు మూడెకరాలు, దళిత బంధు తదితరాల కోసం కేటాయించాలన్నారు.

                కేంద్రం రాష్ట్రానికి ఏమీ చేయకుండానే ఎయిమ్స్‌, రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిందా? అన్నారు. ఎంఎంటీఎస్‌ రెండోదశకు నిధులివ్వాలని రాసిన లేఖలకు జవాబివ్వలేదన్నారు.  మోదీ హయాంలో తెలంగాణకు ఎయిమ్స్‌ వచ్చింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం భవనాన్ని స్వాధీనం చేయలేదు. కేంద్ర ప్రాయోజిత పథకంలో తెలంగాణకు వైద్య కళాశాలలు, మంజూరు చేస్తామని వైద్య ఆరోగ్య అధికారులు, కేంద్ర మంత్రి లేఖ రాసినా ఇక్కడి సర్కారు స్పందించలేదు. బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వబోమని రాసిచ్చింది మీరు కదా, రాష్ట్రంలో ధాన్యం సేకరణ నుంచి నిల్వ వరకు ప్రతి పైసా కేంద్రం భరిస్తోందన్నారు.

Social Share Spread Message

Latest News