ఫ్రెండ్‌షిప్ పెండ్లి జపాన్‌లో నడుస్తున్న కొత్త ట్రెండ్ ఇది. మూడు పదులు దాటిన పెండ్లి కావడం కష్ట మవుతున్న జపాన్ యువత, ఈ కొత్త ట్రెండ్ పట్ల ఆసక్తి చూపుతున్నది. ప్రేమ, శృంగారానికి దూరంగా ఉంటూ దంపతుల్లా కలిసి జీవించడమే ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్. చట్టపరంగా వీరు దంపతులైనప్పటికీ ఈ రెండింటికీ దూరంగా ఉంటారు. వీరు కలిసి జీవించవచ్చు. లేదా వేర్వేరుగా ఉండవచ్చు.
పిల్లలు కావాలంటే కృత్రిమ గర్భధారణ పద్ధతులు పాటిస్తారు. లేకపోతే పెంచుకుంటారు. పరస్పర అంగీకారం ఉన్నంత కాలం ఇద్దరూ తమకు నచ్చిన వారితో స్వేచ్ఛగా ఉండవచ్చు. 12 కోట్లకు పైగా జనాభా ఉన్న జపాన్ లో ఇలాంటి వారు 12 లక్షల మంది వరకు ఉన్నారు. వివాహం చేసుకున్న వారికి ప్రభుత్వం అందించే అన్ని ప్రయోజనాలు వీరికి కూడా వర్తిస్తాయి.