Namaste NRI

దీపావళికి సరైన సినిమా ఇది

ప్రియదర్శి, నిహారిక ఎన్‌ ఎం జంటగా నటించిన చిత్రం మిత్రమండలి. విజయేందర్‌ దర్శకత్వంలో బీవీ వర్క్స్‌ బ్యానర్‌పై బన్నీ వాస్‌ సమర్పణలో సప్తాస్వ మీడియా వర్క్స్‌ పై కళ్యాణ్‌ మంథిన, భాను ప్రతాప, డా. విజేందర్‌ రెడ్డి తీగల నిర్మించిన చిత్రమిది. ఈ మూవీ ఈనెల 16న రిలీజ్‌ కాబోతోంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు కళ్యాణ్‌ మంథిన, భాను ప్రతాప మీడియాతో ముచ్చటించారు. ఆద్యంతం వినోదాన్ని అందిస్తూనే సెటైరికల్‌గా ఉండే కథ మిత్రమండలి. ఈ కథతో చాలా ఏళ్లుగా ట్రావెల్‌ చేస్తున్నారు బన్నీవాస్‌. ఆయన ద్వారానే ఈ కథ మా వద్దకు వచ్చింది. వినగానే నచ్చేసింది అని అన్నారు.

దర్శకులు అనుదీప్‌, మ్యాడ్‌ కల్యాణ్‌, ఆదిత్యహాసన్‌లతో కలిసి పనిచేసిన అనుభవం డైరెక్టర్‌ విజయేందర్‌కి ఉంది. తను మంచి దర్శకుడు. పూర్తి స్క్రిప్ట్‌తో మా వద్దకు వచ్చాడు. ఈ కథ రాసుకున్నప్పుడే కాస్టింగ్‌ విషయంలో తనకు ఓ ప్లానింగ్‌ ఉంది. అందుకే పాత్రలన్నీ పర్‌ఫెక్ట్‌గా సెట్టయ్యాయి. మొత్తంగా కథ ఎంత అద్భుతంగా రాసుకున్నాడో, అంతకంటే అద్భుతంగా తెరకెక్కించాడు విజయేందర్‌ అని తెలిపారు. బ్రహ్మానందం స్పెషల్‌ అట్రాక్షన్‌గా తీసిన జంబర్‌ గింబర్‌ లాలా సాంగ్‌ ఈ సినిమాకే హైలైట్‌ అని, ఆ పాట చిత్రీకరణ విషయంలో బ్రహ్మానందం బాగా సహకరించారని నిర్మాతలు చెప్పారు.

మిత్రమండలి ఓ బడ్డీస్‌ కామెడీ. జంగ్లీ పట్టణం అనే ఫిక్షనల్‌ టౌన్‌లో జరిగే కథ ఇది. ఇందులోని పాత్రలు, సన్నివేశాలు యూత్‌కి రిలేటెడ్‌గా ఉంటాయి. ప్రియదర్శి కామెడీ టైమింగ్‌తో అదరగొట్టేశాడు. ఇక నిహారక తన శైలి సెటైర్లతో అలరిస్తుంది. లేని ఓ కులం పేరుని ఈ సినిమాకోసం తీసుకొచ్చాం. సమాజంలో ఉన్న క్యాస్ట్‌ సిస్టం మీద సెటైరికల్‌గా ఈ సీన్లు ఉంటాయి. దీపావళికి సరైన సినిమా ఇది అని తెలిపారు.ఈ నెల 16న సినిమా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events