Skip to main content

Namaste NRI

చిన్న చిత్రాల్లో ఈ సినిమా ఓ బెంచ్‌ మార్క్‌ క్రియేట్‌ చేస్తుంది

నూతన నటీనటులను ప్రోత్సహిస్తూ కేఏ ప్రొడక్షన్స్‌ పతాకంపై కిరణ్‌ అబ్బవరం నిర్మిస్తున్న చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ. సాయితేజ్‌, వేద జలంధర్‌ హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. ముని దర్శకుడు. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్‌ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు.

ఈ సినిమా మంచి సమ్మర్‌ వెకేషన్‌లా అనిపిస్తుందని, తిమ్మరాజుపల్లి అనే ఊరిలో జరిగిన సంఘటనల నేపథ్యంలో వినోదం, థ్రిల్లింగ్‌ అంశాలతో మెప్పిస్తుందని, చిన్న బడ్జెట్‌లో ఇంత క్వాలిటీగా సినిమా చేయొచ్చా అని అందరూ ఆశ్చర్యపోతారని కిరణ్‌ అబ్బవరం అన్నారు. చిన్న చిత్రాల్లో ఈ సినిమా ఓ బెంచ్‌ మార్క్‌ క్రియేట్‌ చేయబోతున్నదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామీణ నేపథ్యంలో ఆహ్లాదభరిత కథాంశంతో అందరికి నచ్చే చిత్రమిదని దర్శకుడు వి.మునిరాజు అన్నారు. కొత్తవారైనా నటీనటులందరూ అద్భుతమైన పర్‌ఫార్మెన్స్‌ కనబరిచారని ఈటీవీ విన్‌ బిజినెస్‌హెడ్‌ సాయికృష్ణ ప్రశంసించారు.

Social Share Spread Message

Latest News