అర్జున్ అంబటి హీరోగా గణపర్తి శ్వేత సమర్పణలో స్వయంభూ క్రియేషన్స్ బ్యానర్‌పై గణపర్తి నారాయణరావు నిర్మించిన చిత్రం పరమపద సోపానం. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తూ నాగ శివ దర్శకత్వం వహించారు. తేలప్రోలు ప్రసన్న మరో నిర్మాత కాగా, పులగం సుప్రియ సహ నిర్మాతగా వ్యవహరించారు. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 24న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకులు భీమనేని శ్రీనివాసరావు, వీర శంకర్, సముద్ర తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దర్శకులు భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రసన్న ఈ గురించి నాకు చెప్పారు. ఈ చిత్రంతో కొత్త వారు తెరకు పరిచయం కాబోతున్నారు. నాగ శివకి మంచి విజయం దక్కాలి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

ప్రసన్న, శివ, వీర శంకర్ వల్లే ఈ చిత్రం ఇక్కడి వరకు వచ్చింది. దేవ్ అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు. ఈశ్వర్‌తో నేను ఇది వరకు మూడు సినిమాలు చేశాను. రాంబాబు మాకు మంచి పాటల్ని ఇచ్చారు. ఈ సినిమాతో మేం ఓ మంచి ప్రయత్నం చేశాం. థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి నచ్చుతుంది అని హీరో అర్జున్ అంబటి చెప్పారు.















