ఢిల్లీ మద్యం విధానం కేసులో ఈడీ, సీబీఐ నమోదు చేసిన వేర్వేరు కేసుల్లో ఎమ్మెల్సీకి బెయిల్ మంజూరు కావడం పట్ల బీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ కువైట్ శాఖ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆడబిడ్డపై కవితపై ఈడీ అక్రమంగా కేసులు బనాయించారని ఆమె ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు చూపించకుండా కవితను ఐదున్నర నెలలు జైలులో ఉంచడం తీవ్ర బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీని, కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతోనే కవితను జైలుకు పంపించారని అభిలాష గొడిశాల ఆరోపించారు. అయినప్పటికీ రాజకీయ కుట్రతో పెట్టిన కేసులో చివరకు న్యాయమే గెలిచిందని అన్నారు.