Skip to main content

Namaste NRI

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన టీఆర్ఎస్ ఎంపీలు

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డిని టీఆర్‌ఎస్‌ ఎంపీలు కలిశారు. రామప్పకు యూనెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు వచ్చిన నేపథ్యంలో పర్యాటక అభివృద్ధిపై చర్చించారు. రామప్ప ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందడం కోసం రూ.250 కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని ఎంపీల బృందం విజ్ఞప్తి చేసింది. అలాగే భద్రాచలం దేవాలయాన్ని ప్రసాద్‌ స్కీంలో చేర్చాలని మంత్రిని కోరారు. తెలంగాణలోని ఇతర పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని,  సమ్మక`సారక్క జాతరను టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో బండా ప్రకాశ్‌, రంజిత్‌ రెడ్డి, మాలోత్‌ కవిత, బడుగుల లింగయ్య యాదవ్‌, పసునూరి దయాకర్‌, వెంకటేశ్‌ నేత ఉన్నారు.

Social Share Spread Message

Latest News