
అగ్రరాజ్యం అమెరికాలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా పై దాడులు ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా అమెరికా వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో టెస్లాపై స్థానికులు దాడులు చేస్తున్నారు. షోరూమ్‌పై కాల్పులు, నిప్పంటించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. రెండు రోజుల క్రితం లాస్ వెగాస్ లో ఉన్న టెస్లా షోరూంలోని ఐదు కార్లకు దుండగులు నిప్పంటించారు. ఈ ఘటనలో ఆ కార్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి.

వరుస దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు. ఈ మేరకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. టెస్లా కార్లపై దాడికి పాల్పడేవారికి 20 సంవత్సరాలు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. టెస్లాపై దాడులకు పాల్పడే వారు 20 సంవత్సరాల వరకూ జైలు శిక్షకు గరయ్యే అవకాశం ఉంది. దాడులను ప్రోత్సహిస్తున్న వారికి కూడా శిక్ష తప్పదు అని హెచ్చరించారు.
