Skip to main content

Namaste NRI

అదానీ కేసు ఉపసంహరణపై .. యూఎస్‌ అటార్నీ వివరణ

ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీపై కేసు ఉపసంహరణలో తన ప్రమేయం ఏమీ లేదని అమెరికా అటార్నీ జోసెఫ్‌ నోసెల్లా జూనియర్‌ స్పష్టం చేశారు. ఫెడరల్‌ జడ్జి ముందు ఆయన సాక్ష్యం ఇస్తూ, విధాన నిర్ణయం తీసుకునే హక్కు తనకు లేదని చెప్పారు. అదానీపై విచారణను విరమించుకోవడానికి సంబంధించి న్యాయ శాఖ ఇచ్చిన వివరణను సందేహించడానికి తనకు ఎలాంటి కారణం కన్పించ లేదని తెలిపారు.

ఈ మేరకు ఆయన దాఖలు చేసిన ప్రమాణ పత్రంలో, న్యూయార్క్‌ తూర్పు డిస్ట్రిక్ట్‌ ప్రాసిక్యూటర్‌నైన తనతో పాటు రక్షణ న్యాయవాదులు సమర్పించిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ప్రధాన అసోసియేట్‌ డిప్యూటీ అటార్నీ జనరల్‌ ఆర్‌ ట్రెంట్‌ మెక్‌ కటార్‌ ఒక్కరే అభియోగాలని కొట్టివేయాలని పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్‌ కోసం ఇకపై ప్రభుత్వ నిధులు వెచ్చించకూడదనే అధికారాన్ని మెక్‌ కటార్‌ వినియోగించారని నొసెల్లా తెలిపారు.

Social Share Spread Message

Latest News