Namaste NRI

విజయ్ ఆంటోని తూఫాన్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌

విజయ్‌ ఆంటోని  హీరోగా నటించిన పొయెటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ తుఫాన్‌. ఆగస్ట్‌ 2న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో విజయ్‌ ఆంటోని మాట్లాడారు. సత్యరాజ్‌ ఈ సినిమాలో ఓ మంచి రోల్‌ చేశారు. ఆయన చేయడం వల్లే ఈ సినిమాకు పరిపూర్ణత వచ్చింది. దర్శకుడు విజయ్‌ మిల్టన్‌ స్క్రిప్ట్‌ ఈ సినిమాకు ప్రధానబలం. కేవలం కంటెంట్‌ మీదు న్న నమ్మకంతో ఖర్చుకు వెనుకాడకుండా ఈ సినిమాను నిర్మించారు నిర్మాతలు కమల్‌ బోరా, డి.లలితా, బి.ప్రదీప్‌, పంకజ్‌ బోరా. క్వాలిటీ, కంటెంట్‌ ఈ సినిమాకు తప్పకుండా విజయాన్నిస్తాయి అని నమ్మకం వ్యక్తం చేశారు.

 అతిథిగా విచ్చేసిన దర్శకుడు కరుణాకరణ్‌ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. తన పాత్రను దర్శకుడు విజయ్‌ మిల్టన్‌ చాలా జాగ్రత్తగా డిజైన్‌ చేశాడని, తన లుక్‌, మేకోవర్‌ అంతా కొత్తగా ఉంటుందని, అందరికీ నచ్చే థ్రిల్లర్‌గా ఈ సినిమా నిలుస్తుందని సత్యరాజ్‌ చెప్పారు. సాంకేతికంగా ఈ సినిమా నెక్ట్స్‌ లెవ ల్లో ఉంటుందని, తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నామని దర్శక, నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు. సంగీత దర్శకుడు అచ్చు రాజమణి కూడా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UULmVdT0LRtF67ZbuX2dEeQQ&layout=gallery[/embedyt]