Skip to main content

Namaste NRI

ఆ 3 మార్గాలనూ దిగ్బంధిస్తాం.. అమెరికాకు ఇరాన్‌ హెచ్చరిక

హొర్ముజ్‌ జలసంధిని దిగ్బంధిస్తూ దాని గుండా తమ నౌకలు, ట్యాంకర్లు వెళ్లకుండా అడ్డుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వైఖరిపై ఇరాన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. హొర్ముజ్‌పై అమెరికా దిగ్బంధం కొనసాగితే పర్షియన్‌ గల్ఫ్‌, ఒమన్‌ గల్ఫ్‌, ఎర్ర సముద్రం మార్గాల్లో జరిగే వాణిజ్య రవాణాను అడ్డుకుంటామని అమెరికాను టెహ్రాన్‌ హెచ్చరించింది. ఈ మేరకు టెహ్రాన్‌ సీనియర్‌ మిలిటరీ కమాండర్‌ అలీ అబ్దొల్లాహి మాట్లాడుతూ తమ నౌకలు, ట్యాంకర్లను అమెరికా అడ్డుకోవడం కాల్పుల విరమణ ఉల్లంఘనకు నాందిగా భావిస్తామని అన్నారు. ‘శక్తిమంతమైన ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ సాయుధ దళాలు ఈ మార్గాల గుండా ఎలాంటి ఎగుమతులు, దిగుమతులు అంగీకరించబోవు’ అని పేర్కొన్నారు. కాగా, ఎర్రసముద్రంపై నౌకలను యెమన్‌లోని హౌతీ రెబల్స్‌ సహాయంతో అడ్డుకోవాలని ఇరాన్‌ యోచిస్తున్నది.

Social Share Spread Message

Latest News