Skip to main content

Namaste NRI

భారత్ ఒక్కరోజులోనే… అమెరికా మాత్రం!

 ఇండియాలో ఓట్ల లెక్కింపుపై ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ ప్రశంసలు కురిపించారు. ఇటీవల మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ అసెంబ్లీ సహా పలు రాష్ర్టాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో పోలైన 6.4 కోట్ల ఓట్లను ఒక్క రోజులోనే లెక్కించి ఫలితాలు వెల్లడించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎన్నికలు ముగిసిన 18 రోజుల తర్వాత కూడా పోలైన 1.5 కోట్ల ఓట్లను కాలిఫోర్నియా ఇంకా లెక్కిస్తూనే ఉన్నదని విమర్శించారు. ఇండియా ఒక్క రోజులోనే 6.4 కోట్ల ఓట్లను లెక్కించింది. కాలిఫోర్నియా ఇంకా ఓట్లను లెక్కిస్తూనే ఉంది అని మస్క్‌ పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News