భారతీయులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) బంపర్ ఆఫర్ ప్రకటించింది. యూఏఈలో ఉద్యోగం కోసం చూస్తున్న భారతీయులు దేశంలో హోస్ట్ లేదా స్పాన్సర్ అవసరం లేకుండానే విజిట్ వీసాపై దేశంలోకి ప్రవేశించవచ్చని యూఏఈ అధికారిక పోర్టల్ పేర్కొంది. విదేశీయులు ఉద్యోగ అవకాశాలను అన్వేషించడానికి ప్రత్యేకంగా యూఏఈకి వెళ్లేందుకు ఈ వీసా వీలు కల్పిస్తుంది.

దరఖాస్తుదారులు ఒకే ప్రయాణం(సింగిల్ ట్రిప్) కోసం 60, 90 లేదా 120 రోజుల చెల్లుబాటు కాలాన్ని ఎంచుకోవచ్చు. అంటే అర్హులైన భారతీయ ఉద్యోగార్థులు ముందుగా ఉద్యోగ ఆఫర్‌ను పొందాల్సిన అవసరం లేకుండానే యూఏఈకి వెళ్లి ఉద్యోగాన్ని వెదుక్కోవచ్చు. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు నిర్దిష్టమైన విద్య, వృత్తిపరమైన స్థాయి, ఆర్థికపరమైన అర్హతలను కలిగి ఉండాలని ప్రభుత్వం పేర్కొంది.















