Skip to main content

Namaste NRI

తెలుగు తెరపైకి మరో విదేశీ తార

తెలుగు తెరపైకి మరో విదేశీ తార అడుగుపెట్టబోతున్నది. సత్యదేవ్ కొత్త చిత్రంతో జెన్నిఫర్ పిచినెటో నాయికగా ఎంపికైంది. బ్రెజిలియన్ మోడల్గా పేరు తెచ్చుకున్న ఈ భామ అక్షయ్ కుమార్ నటించిన ారామ్ సేతు్ణ సినిమాలో ముఖ్య పాత్రను పోషించింది. సత్యదేవ్ 26వ సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో డాలీ ధనుంజయ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. ఓల్డ్ టౌన్ పిక్చర్స్ పతాకంపై బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. ఇందులో ఒక నాయికగా ప్రియ భవానీ శంకర్ ఎంపికవగా, తాజాగా మరో హీరోయిన్గా జెన్నిఫర్ను తీసుకున్నారు. క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్లో ఉంది.

Social Share Spread Message

Latest News