Skip to main content

Namaste NRI

కేజేక్యూ వచ్చేస్తున్నాడు

1990ల కాలంలో సాగే పీరియడ్‌ క్రైమ్‌ డ్రామా కేజేక్యూ. (కింగ్ జాకీ క్వీన్) అనేది ఉపశీర్షిక. దీక్షిత్‌శెట్టి హీరోగా, శశి ఓదెల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి స్వర్గీయ కె.కె దర్శకుడు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్‌ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ చిత్ర దర్శకుడు కేకే గత ఏడాది కన్ను మూశారు.

ఆయనకు సినిమాపై ఉన్న పాషన్‌, విజన్‌కి నివాళిగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్టు మేకర్స్‌ తెలిపారు. ఇప్పటికే ప్రచార చిత్రాల వల్ల సినిమాపై అంచనాలు పెరిగాయని, సినిమా తప్పకుండా ప్రేక్షకులకు ఓకొత్త అనుభూతినిస్తుందని మేకర్స్‌ నమ్మకం వెలిబుచ్చారు. యుక్తి తరేజా కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నగేష్‌ బానెస్‌, సంగీతం: పూర్ణచంద్ర తేజస్వి.

Social Share Spread Message

Latest News