భారత సంతతి మహిళకు 2026 నోబెల్ శాంతి బహుమతి దక్కింది. ఈ యేటి నోబెల్ శాంతి బహుమతిని నవనీతం నావిపిళ్లై గెలుచుకున్నారు. ఓస్లోలోని నార్వేయన్ నోబెల్ కమిటీ ఈ అవార్డును ప్రకటించింది. శాంతి, అంతర్జాతీయ న్యాయ స్థాపన కోసం ఆమె తీవ్రంగా కృషి చేసినట్లు నోబెల్ కమిటీ తన ప్రకటనలో పేర్కొన్నది.

ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సమితి హై కమీషనర్‌గా 2008లో నావి పిళ్లై నియమితులయ్యారు. 2008, సెప్టెంబర్ ఒకటో తేదీన ఆమె ఆ పోస్టును స్వీకరించారు. సమగ్రమైన ప్రపంచ న్యాయం కోసం ఆమె పోరాటం చేశారు. యుద్ధ నేరాలు, మానవాళిపై నేరాలు, ఊచకోత లాంటి కేసుల్లో కచ్చితంగా ప్రాసిక్యూషన్ అమలు చేశారు.

దక్షిణాఫ్రికాకు చెందిన పిళ్లై 1967లో తన స్వంత ప్రావిన్సు నాటల్‌లో ఆమె లా ప్రాక్టీస్ చేశారు. సామాజిక కార్యకర్తలకు గతంలో ఆమె డిఫెన్స్ అటార్నీగా చేశారు. రాబెన్ ఐలాండ్‌లో ఉన్న ఖైదీల హక్కుల కోసం ఆమె పోరాడారు. డర్బన్‌లో ఉన్న భారతీయ తమిళ కుటుంబంలో ఆమె జన్మించారు. వర్ణవివక్షకు వ్యతిరేకంగా ఆమె లీగల్‌గా వాదించారు. నెల్సన్ మండేలాకు ఆమె సపోర్టు ఇచ్చారు.

దక్షిణాఫ్రికాలోని నాటల్ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్ఎల్బీ పూర్తి చేశారామె. న్యాయ పట్టాలో మాస్టర్స్‌తో పాటు హార్వర్డ్ వర్సిటీ నుంచి జురిడికల్ సైన్స్‌లో డాక్టరేట్ చేశారు. 1941లో నవనీతం పుట్టారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈక్వాలిటీ నౌ అనే అంతర్జాతీయ మహిళా హక్కుల సంస్థను ఆమె స్థాపించారు. క్వాజులు నాటల్ వర్సిటీలో లెక్చరర్‌గా చేశారు. డర్బర్ వెస్ట్విల్లే వర్సిటీలి వైస్‌ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు.

1995లో దక్షిణాఫ్రికా హైకోర్టులో తాత్కాలిక జడ్జడీగా చేశారు. ఆ ఏడాదిలోనే యూఎన్ జనరల్ అసెంబ్లీకి అంతర్జాతీయ క్రిమినల్ ట్రిబ్యునల్‌కు జడ్జీగా ఎన్నికయ్యారు. రువాండాలో 8 ఏళ్లు చేశారు. రేప్, భావస్వేచ్ఛ కేసుల్లో వాదించారు. 2003లో హేగ్‌లోని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు జడ్జీగా ఆమె నియమితులయ్యారు.















