Skip to main content

Namaste NRI

మధ్యంతర ఎన్నికల్లో ఓడిపోతే .. ఏం చేస్తానంటే ? : ట్రంప్

ఇరాన్ తో యుద్ధం, ప్రపంచ దేశాలతో ఘర్షణల నేపథ్యంలో అమెరికా లో అధికశాతం ప్రజలు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ను వ్యతిరేకిస్తున్నట్లు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు మెజారిటీ సాధిస్తే, తాను మిస్టర్ వీటో గా మారాల్సి రావచ్చని పేర్కొన్నారు. వారి అధికారాలను నియంత్రించేందుకు వీటో పవర్ ను వినియోగిస్తానని చెప్పారు.

ఎన్నికల్లో డెమోక్రాట్‌లు గెలిచి కాంగ్రెస్‌పై పట్టు సాధిస్తే వారుచేసే బిల్లులను ఆమోదించకుండా అన్నింటినీ తిరస్కరిస్తానని ట్రంప్ అన్నారు. ఒకటి రెండు నెలలపాటు అలాచేస్తే చివరికి వారే త‌న‌ దగ్గరికి వచ్చి ఒప్పందం చేసుకోవాలని చూస్తారని, అయితే అవన్నీ వృథా ప్రయత్నాలే అవుతాయని ట్రంప్ అన్నారు. తన పాలనలో చరిత్రలోనే అత్యుత్తమ ఆర్థికవ్యవస్థగా అమెరికా ఎదిగిందని పేర్కొన్నారు. రిపబ్లికన్‌ల‌కు వచ్చే ఓట్లను సర్వేలు సరిగ్గా చూపించట్లేదని అసహనం వ్యక్తంచేశారు. అవకాశం వస్తే మరోసారి అధ్యక్ష స్థానానికి పోటీ చేయడానికీ తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. అయితే రాజ్యాంగ నిబంధనలు కఠినంగా ఉండడంవల్ల అది సాధ్యం కాకపోవచ్చని ట్రంప్‌ నిరాశ వ్యక్తం చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events