Skip to main content

Namaste NRI

అమెరికా చరిత్రలోనే అత్యధికం .. ఎలన్ మస్క్

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచిన టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌  ఏడాదికి దాదాపు 85 వేల కోట్ల (11 బిలియన్‌ డాలర్లు) పన్ను కట్టేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌ ఉన్నాడు. ఈ ఏడాది టెస్లా మార్కెట్‌ విలువ లక్ష కోట్ల డాలర్లు దాటింది. ఫోర్డ్‌ మోటార్స్‌, జనరల్‌  మోటార్స్‌ రెండిరటి విలువ కంటే ఎక్కువ. ఇప్పటి వరకు 14 బిలియన్‌ డాలర్ల విలువైన షేర్లను మస్క్‌ విక్రయించాడు.

                అమెరికాకు చెందిన డెమొక్రాటిక్‌ సెనేటర్‌ ఎలిజబెత్‌ వార్రెన్‌ మస్క్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించాడు.  పన్ను ఎగవేత పద్దతి మారుద్దాం అంటూ చెప్పుకొచ్చాడు. దీనికి మస్క్‌ కూడా ధీటుగా బదులిచ్చాడు. తాను పన్ను ఎగ్గొట్టే వ్యక్తి కాదన్నాడు. రెండు సెకన్లు కళ్లు తెరిచి చూడాలని హితవు పలికాడు. ఈ ఏడాది తాను చెల్లించే పన్ను అమెరికా చరిత్రలోనే అత్యధికం అంటూ కౌంటర్‌ ఇచ్చాడు. ఎంత చెల్లించబోతున్న విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడిరచారు. అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా టైమ్‌ మ్యాగజైన్‌ కూడా ఎలన్‌ మాస్క్‌కి కితాబు ఇచ్చింది.

Social Share Spread Message

Latest News