కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో కువైత్ అంతర్జాతీయ ప్రయాణికులకు కొత్త ఆంక్షలు విధించింది. శరవేగంగా ప్రబలుతున్న కొత్త వేరియంట్‌ను కట్టడిచేసేందుకు ఆ దేశ ఆరోగ్య శాఖ విదేశీ ప్రయాణికులకు కొత్త ఆంక్షలు తీసుకొచ్చింది. ఇప్పటికే తొమ్మిది ఆప్రికన్ దేశాలపై నిషేధం విధించిన కువైత్ తాజాగా అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీ పీసీఆర్ టెస్టు, 10 రోజుల హోం క్వారంటైన్ తదితర కొత్త ఆంక్షలు విధించంది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ఈ ఆంక్షలు డిసెంబర్ 26 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.














