Skip to main content

Namaste NRI

ఒకే నెలలో 45 లక్షల మంది గుడ్ బై

అమెరికాలో గత నవంబరులో అత్యధికంగా 45 లక్షల మంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు.  కార్మిక శాఖ అంచనా ప్రకారం సెప్టెంబరుతో పోల్చుకుంటే వీరి సంఖ్య 3 శాతం పెరిగింది. ఫుడ్‌ సర్వీసెస్‌, హెల్త్‌, ట్రాన్స్‌పోర్ట్‌ రంగాల్లో పనిచేస్తున్నవారు ఎక్కువగా ఉద్యోగాలు మానేస్తున్నారు. మరింత మెరుగైన వేతనం లభించే కొత్త ఉద్యోగాల కోసమే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్నారు. మరోవైపు అమెరికాలో ఉద్యోగాల సంఖ్య కూడా పెరుగుతోంది. గత అక్టోబరు నాటికి 1.11 కోట్ల ఉద్యోగాలు అమెరికాలో అందుబాటులో ఉన్నాయి. నవంబరు నాటికి ఈ సంఖ్య 1.6 కోట్లకు చేరింది.

Social Share Spread Message

Latest News