Namaste NRI

మార్చి 1 నుంచి హెచ్ 1బీ వీసాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ

అమెరికాలో విదేశీయులు ఉద్యోగం చేసేందుకు జారీ చేసే హెచ్‌`1బీ వీసాల దరఖాస్తులను ఈ ఏడాది మార్చి 1 నుంచి స్వీకరించనున్నట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (యుఎస్‌సిఐఎస్‌) ఒక ప్రకటనలో తెలిపింది. మార్చి 18వ తేదీ వరకూ వాటి స్వీకరణ కొనసాగుతుందని వెల్లడిరచింది. తమకు వచ్చిన ప్రతి దరఖాస్తుకు ఒక కన్ఫర్మేషన్‌ సంఖ్యను జతచేస్తామని, వాటి ఆధారంగా రిజిస్ట్రేషన్ల పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని పేర్కొంది. 2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకుని రూ.750 (10 డాలర్లు) రుసుము చెల్లించాల్సి ఉంటుంది. తుది గడువు అనంతరం ఏవైనా కొన్నింటినీ ఎంపిక చేసి, మార్చి 31 కల్లా ఆ విషయాన్ని వాటి దరఖాస్తుదారులకు తెలియపరుస్తామని యూఎస్‌సీఐఎస్‌ పేర్కొంది.  హెచ్‌ 1 బీ వీసా పొందిన వారు ఈ ఏడాది అక్టోబర్‌ నుంచి అమెరికాలో ఉద్యోగం చేసే వీలుంటుంది. ప్రతి ఏటా అమెరికాలో 65 వేల కొత్త హెచ్‌ 1బీ వీసాలతో పాటు అమెరికాలో మాస్టర్స్‌ చేసే వారి కోసం మరో 20 వేల వీసాలు కేటాయిస్తుంది.  హెచ్‌ 1బీ వీసాలు పొందేవారిలో 70 శాతం భారతీయులే ఉంటారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events