Namaste NRI

తమకు ఆ లోచన లేదు.. నాటో

రష్యా ఉక్రెయిన్‌ సరిహద్దులో నెలకొన్న పరిస్థితులు రోజురోజుకు హాట్‌ టాపిక్‌ గా మారిపోతున్నాయి. ఉక్రెయిన్‌ పై దాడి చేసేందుకు రష్యా సన్నద్ధమవుతోంది. ఇప్పటిక ఆ దేశ సరిహద్దుల సమీపంలో లక్షలాది సైనికులను మోహరించిన రష్యా ఏ క్షణమైన దాడికి పాల్పడే అవకాశముంది. ఒకవేళ ఉక్రెయిన్‌పై దాడి జరిగితే, ఆ దేశానికి మద్దతుగా నాటో (నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌) బలగాలు రంగంలోకి దిగుతాయని అందరూ భావిస్తున్నారు. కానీ తమకు ఆ ఆలోచన లేదని నాటో వెల్లడిరచింది. ఈ సందర్భంగా నాటో సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ మీడియాతో మాట్లాడుతూ ఉక్రెయిన్‌కు నాటో బలగాలను పంపించే ఆలోచన మాకు లేదు. అయితే వారికి మద్దతు తెలపడంపై దృష్టి సారించాం అని చెప్పుకొచ్చారు.  సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకొస్తున్న సమయంలో మద్దతు ఇస్తామంటూ చెప్పిన యూరోపియన్‌ యూనియన్‌ నాటో దేశాలకు షాక్‌ ఇస్తున్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events