Skip to main content

Namaste NRI

లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు.. ఎఫ్ 3 ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ కాంబినేషన్‌లో సక్సెస్‌పుల్‌ చిత్రాల దర్శకుడు అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ఎఫ్‌3. తాజాగా ఈ మువీకి సంబంధించిన ఫస్ట్‌ సింగిల్‌ లబ్‌ డబ్‌ లబ్‌ డబ్‌ డబ్బును విడుదల చేశారు. రాక్‌ స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ స్వరపరిచిన ఈ పాటలో డబ్బుకు ఉన్న శక్తి, గొప్పదనాన్ని వివరించారు.     రామ్‌ మిర్యాల గాత్రం, భాస్కర భట్ల సాహిత్యం అందించారు. విజువల్‌గా కూడా ఈ పాటలో ఎంతో స్టైలీష్‌గా తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. శ్రోతలను అలరించేలా ఉన్న ఈ పాట ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ పాటలో తమన్నా కూడా కనిపిస్తున్నారు. పాట చివర్లో సినిమాలోని నటీనటులంతా కూడా డబ్బు రావాలని చేసే ప్రార్థనలు అందరికి నవ్వు తెప్పిస్తున్నాయి. పాటలోనే ఉంటే మేకర్స్‌ చెప్పినట్లే ఎఫ్‌ 3 సినిమాతో పొట్ట చెక్కలవ్వడం ఖాయం అనేలా కనిపిస్తోంది.

                  వెంకటేష్‌ వరుణ్‌ తేజ్‌లు భిన్న గెటప్స్‌లో కనిపిస్తున్నారు. దిల్‌ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శిరిష్‌ నిర్మిస్తున్నారు.  తమన్నా, మెహరీస్‌, సోనాల్‌ చౌహాన్‌ కథానాయికలు. థియేటర్స్‌లో ప్రేక్షకులని నవ్వులతో ముంచెత్తడానికి ఏప్రిల్‌  28న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందని మేకర్స్‌ రీసెంట్‌గా ప్రకటించారు. ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్‌, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్‌, ఆర్ట్‌: ఏఎస్‌ ప్రకాష్‌, సహనిర్మాత : హర్షిత్‌ రెడ్డి. కూర్పు : తమ్మిరాజు.

Social Share Spread Message

Latest News