ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో చాలా దేశాలు కరోనా ఆంక్షలను ఎత్తివేస్తున్నాయి. తాజాగా విదేశీ ప్రయాణికులపై విధించిన ఆంక్షలను ఫ్రాన్స్ సడలించింది. వ్యాక్సిన్ తీసుకున్నవారు కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ చూపించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. ఇది నేటి నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఏ దేశం నుంచైనా ఫ్రాన్స్ వచ్చేవారు వ్యాక్సిన్ తీసుకున్నట్లు సర్టిఫికెట్ చూపిస్తే సరిపోతుందని ప్రకటించింది. గ్రీన్ లిస్ట్‌లోని దేశాల నుంచి వచ్చేవారు ఒక వేళ వ్యాక్సిన్ తీసుకోనట్లయితే కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుందని తెలిపింది. అయితే వారు క్వారంటైన్‌లో ఉండాల్సిన అసవరం లేదని వెల్లడిరచింది. కాగా, ఆరెంజ్ జాబితాలో ఉన్న దేశాల నుంచి వచ్చేవారు మాత్రం ఫ్రాన్స్‌కు ఎందుకు వస్తున్నారో సరైన కారణం చెప్పాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.














