Namaste NRI

48 గంటల్లో ఆ దేశాన్ని విడిచి వెళ్లాలి : అమెరికా

ఏ క్షణమైన రష్యా ఉక్రెయిన్‌ ఆక్రమణకు వెళ్లవచ్చు అని అమెరికా వార్నింగ్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అమెరికా పౌరులు అంతా 48 గంటల్లో ఆ దేశానికి విడిచి వెళ్లాలని అమెరికా ఆదేశించింది.  ఏరియల్‌ బాంబింగ్‌తో ఆక్రమణ మొదలయ్యే అవకాశాలు ఉన్నట్లు అమెరికా అంచనా వేసింది. ఒకవేళ వైమానికి దాడులు మొదలైతే అప్పుడు అక్కడ నుంచి డిపార్ట్‌ కావడం ఇబ్బందికరంగా మారుతుందని, ప్రజల జీవితాలు ప్రమాదంలో పడుతాయని వైట్‌హౌజ్‌ పేర్కొన్నది. రష్యా దళాలు భారీ సైనిక చర్యకు దిగే అవకాశాలు ఉన్నట్లు అమెరికా జాతీయ భద్రత సలహాదారు జేక్‌ సుల్లివాన్‌ తెలిపారు. ఈ నేపథ్యంలోనే అమెరికా హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

                         భవిష్యత్తును అంచనా వేయలేకపోతున్నామని, ఏం జరుగబోతుందో కచ్చితంగా తెలియడం లేదని, కానీ రిస్క్‌ మాత్రం ఎక్కువే ఉందని, రాబోయే ప్రమాదం కూడా అర్థం అవుతుందని జేక్‌ తెలిపారు. అయితే ఉక్రెయిన్‌పై ఆక్రమణకు వెళ్లడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తుది నిర్ణయం తీసుకున్నాడో లేదో ఇంకా తెలియదన్నాడు. కానీ సైన్యం మాత్రం వైమానిక దాడులతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోందన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events