Namaste NRI

లండన్ పోలీస్ బాస్ గా ప్రవాస భారతీయుడు

లండన్‌ పోలీస్‌ కమిషనర్‌ రేసులో ప్రవాస భారతీయుడు అనిల్‌ కాంతి నీల్‌ బసు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే ఈ పదవిని చేపట్టిన తొలి శ్వేతజాతీయేతరుడిగా ఆయన రికార్డులోకి ఎక్కుతారు. అనిల్‌ కాంతి నీల్‌ బసు తండ్రిది కోల్‌కతా. 1961లో ఇంగ్లండ్‌ షిప్ట్‌ అయ్యారు. ఆయన భార్య ఓ నర్సు. అనిల్‌ కాంతి బసు యూకేలోనే పుట్టి పెరిగారు. నాటింగ్‌హోమ్‌ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా తీసుకున్నాక 1992లో మెటో పోలీస్‌శాఖలో చేరారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. కౌంటర్‌ టెర్రరిజమ్‌ చీఫ్‌గా, స్పెషలిస్ట్‌ ఆపరేషన్స్‌ బాస్‌గా పని చేశారు.

 ఇంగ్లండ్‌ పోలీస్‌ శాఖలో అనిల్‌కాంతికి మంచి పేరుంది. ఎంఐ 15, యూకే డొమెస్టిక్‌ సర్వీస్‌లో సైతం అనిల్‌ కాంతిపై సదాభిప్రాయం కలిగి ఉంది. లండన్‌ మెట్రోపాలిటన్‌ పోలీస్‌ కమిషనర్‌గా పని చేస్తున్న క్రెసిడా తన  ఉద్యోగానికి రాజీనామా చేశారు. దీంతో కొత్త కమిషనర్‌ ఎంపిక అనివార్యంగా మారింది. ఈ పదవి కోసం ఎంపిక చేసిన పోలీసు అధికారుల తుది జాబితాలో అనిల్‌ కాంతి ఉన్నట్లు తెలుస్తోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events