Skip to main content

Namaste NRI

ఉక్రెయిన్ పై దాడి చేస్తే… రష్యాపై కఠినమైన ఆంక్షలు

ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు దిగితే మాత్రం రష్యా కంపెనీలపై తీవ్రమైన ఆంక్షలను విధిస్తామని, అవసరమైతే మూసేస్తామని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగితే మాత్రం తాము కూడా అంతే తొందరగా స్పందిస్తామని అన్నారు. రష్యా కంపెనీలపై కఠినతరమైన ఆంక్షలను విధిస్తామని ఆయన ప్రకటించారు. వ్యక్తులపై, సంస్థలపై ఆంక్షలు విధించడానికి తాము పార్లమెంట్‌ నుంచి ప్రత్యేక అనుమతులు కూడా పొందుతామని వెల్లడిరచారు. ఉక్రెయిన్‌పై దాడి చేస్తే రష్యా కంపెనీలు, బ్యాంకులపై విరుచుకుపడతాం. వాటినే టార్గెట్‌ చేస్తాం. కఠినమైన ఆంక్షలు విధిస్తామన్నారు. రష్యా కంపెనీలే ఎక్కడా లేకుండా చేస్తామని హెచ్చరించారు.

Social Share Spread Message

Latest News