Skip to main content

Namaste NRI

ఉక్రెయిన్ అధ్యక్షుడు సంచలన ప్రకటన

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమీర్‌ జెల్‌న్‌స్కీ సంచలన ప్రకటన చేశారు. దేశ రక్షణ కోసం తాము ఎవ్వరికైనా ఆయుధాలను ఇవ్వడానికి రెడీగానే ఉన్నామని కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌కు మద్దతివ్వడానికి సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు. రష్యా మెరుపుదాడి చేసిందని, నాజీ జర్మనీ లాగా రష్యా దాడి చేసిందని జెల్‌న్‌స్కీ అభివర్ణించారు. రష్యా ఉక్రెయిన్‌పై దాడులకు దిగడంతో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమీర్‌ జెల్‌న్‌స్కీ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రష్యా ముందు తలొగ్గే ప్రసక్తే లేదని, ప్రజలందరూ పూర్తి సంయమనంతో ఉండాలని పిలుపునిచ్చారు. మీమీ పట్టణాలను, మీ మీ ఇళ్లను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉండండి. రష్యా ముందు మోకరిల్లే పరిస్థితే లేదు. అనేది మనకు మేరు శిఖరం లాంటిది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీ జర్మనీలు దాడి చేసిన తరహాలో రష్యా మనపై దాడికి దిగింది అని అన్నారు.

…………………..

Social Share Spread Message

Latest News