స్వీడన్, ఫిన్లాండ్ పశ్చిమ దేశాల కుట్రలో భాగస్వామిగా ఉండొద్దని రష్యా హెచ్చరికలు చేసింది. నాటో కూటమిలో చేరాలనే ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని సూచించింది. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ విషయంలో అవసరమైతే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఈ మేరకు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య నేపథ్యంలో స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు నాటో కూటమిలో చేరాలని ఆలోచన చేస్తున్నట్లు వార్తలతో రష్యా మండిపడిరది.














