సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మా ఇష్టం. నైనా గంగూలీ, అప్సర రాణి ప్రధాన పాత్రధారులు. ఈ సందర్భంగా రామ్గోపాల్ వర్మ మాట్లాడుతూ అబ్బాయి, అమ్మాయి మధ్య కాకుండా ఇద్దరమ్మాయిల మధ్య కలిగిన ప్రేమ ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది? అనే థ్రిల్లింగ్ అంశాలతో క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన సినిమా మా ఇష్ట. భారతదేశంలో మొట్టమొదటి పూర్తి స్థాయి లెస్బియన్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అన్నారు. సుప్రీం కోర్టు సెక్షన్ 377ని రద్దు చేసిన తర్వాత వచ్చిన ఆలోచనలతో ఈ సినిమాని రూపొందించామని తెలిపాయి. కంపెనీ నిర్మాణంలో రూపొందింది. సెన్సార్ కార్యాక్రమాలు పూర్తయ్యాయి. ఏప్రిల్ 8న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.














