Skip to main content

Namaste NRI

రవితేజ ధమాకా యాక్షన్ షెడ్యూల్ ప్రారంభమైంది

రవితేజ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ధమాకా షూటింగ్‌ హైదరాబాద్‌లో మొదలైంది.  తాజా చిత్రీకరణలో రవితేజ, ఫైటర్స్‌పై యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రామ్‌, లక్ష్మణ్‌ మాస్టర్ల ఆధ్వర్యంలో షూటింగ్‌ జరుగుతోంది. హై ఆక్టేవ్‌ యాక్షన్‌ ఎపిసోడ్‌ తీస్తున్నట్టు నిర్మాత టీజీ.విశ్వప్రసాద్‌ తెలిపారు. సినిమాలో కీలకమైన ఎపిసోడ్‌ అని అన్నారు. ప్రత్యేకంగా సెట్‌ వేశామన్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన పెళ్లిసందడి ఫేమ్‌ శ్రీలీల నాయికగా నటిస్తోంది.  నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ యాక్షన్‌ ఎపిసోడ్‌తో తాజా షెడ్యూల్‌ ప్రారంభించాం. పెద్ద సెట్‌లో చిత్రీకరణ జరుపుతున్నాం. సినిమాలో ఈ ఫైట్‌ సీక్వెన్స్‌ ఆకర్షణ అవుతుంది అన్నారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వం లో పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్న చిత్రమిది. టీజీ.విశ్వప్రసాద్‌ నిర్మాత, సహ నిర్మాత వివేక్‌ కూచిభొట్ల వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు ప్రసన్న కుమార్‌ బెజవాడ, సంగీతం: భీమస్‌ సిసిరిలియో, ఛాయాగ్రహణం కార్తీక్‌ ఘట్టమనేని.

Social Share Spread Message

Latest News