Skip to main content

Namaste NRI

ఉక్రెయిన్ కు అమెరికా ఆర్థిక సాయం .. ఎంతో తెలుసా?

రష్యా దురాక్రమణను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌కు పలు దేశాలు మద్దతు ఇస్తున్నాయి.  నేరుగా రంగంలోకి దిగకపోయినా పరోక్షంగా సహకారం అందిస్తున్నాయి.  తాజాగా ఉక్రెయిన్‌కు అమెరికా కొత్తగా సహాయం ప్రకటించింది. రష్యాను ఎదుర్కొనేందుకు  అదనంగా 350 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.2,672 కోట్లు) విలువైన సైనిక పరికరాలను అందిస్తామని ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ తెలిపారు. నేల, నింగితోపాటు ఇతర దాడుల ముప్పును ఉక్రెయిన్‌ ఎదుర్కొనేందుకు మూడో ప్యాకేజీ కింద అత్యాధునిక రక్షణ పరికరాలను అందజేస్తామని తెలిపారు. రష్యా అన్యాయ యుద్ధంపై ఉక్రెయిన్‌ పోరాడేందుకు ఇది సహాయపడుతుందని అన్నారు.

Social Share Spread Message

Latest News