Skip to main content

Namaste NRI

రష్యా మరో సంచలన నిర్ణయం

ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా ఇప్పటికే పలు దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే రష్యా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఐరోపా సమైఖ్య (ఈయూ) ఆంక్షల నేపథ్యంలో ఫ్రెంచ్‌ గయానా నుంచి అంతరిక్ష ప్రయోగాలను నిలిపివేస్తున్నట్లు రష్యా ప్రకటించింది. రష్యా అంతరిక్ష సంస్థ రోసోకాస్మోస్‌ డైరెక్టర్‌ జనరల్‌ డిమిత్రి రోగోజిన్‌ ఈ మేరకు ఒక ట్వీట్‌ చేశారు. మా సంస్థలకు వ్యతిరేకంగా ఈయూ విధించిన ఆంక్షలను ప్రతిస్పందనగా, కౌరా కాస్మోడ్రోమ్‌  నుంచి అంతరిక్ష ప్రయోగాల నిర్వహణ, యూరోపియన్‌ భాగస్వాములతో సహకారాన్ని రోసోకాస్మోన్‌ నిలిపివేస్తోంది. ప్రయోగ సిబ్బందితో పాటు సాంకేతిక సిబ్బందిని ఫ్రెంచ్‌ గయనా నుంచి ఉపసంహరించుకుంటోంది అని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News