విజయవంతమైన కె.జి.ఎఫ్ కి కొనసాగింపుగా రూపొందిన చిత్రం కె.జి.ఎఫ్ ఛాప్టర్ 2. యశ్ కథానాయకుడిగా నటించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. భారీ నిర్మాణ హంగులు, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్న ఈ సీక్వెల్ కోసం సిని ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్ వెల్లడిరచారు. ఈ నెల 27న ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. అభిమానులు కోరుకునే అన్ని అంశాలతో ట్రైలర్ తీర్చిదిద్దుతున్నామని చిత్ర బృందం ప్రకటించింది. ఇందులో రాకీ భాయ్‌గా సందడి చేయనున్నారు యశ్. సంజయ్‌దత్, రవీనాటాండన్, ప్రకాష్‌రాజ్, శ్రీనిధి శెట్టి కీలక పాత్రలు పోషించారు. కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. కేజీఫ్ చాప్టర్ 2 ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.














