Namaste NRI

ఉత్కంఠభరితంగా బటర్‌ప్లై టీజర్‌

అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న థ్రిల్లర్‌ చిత్రం బటర్‌ ప్లై. గంటా సతీష్‌బాబు తెరకెక్కిస్తున్నారు. అనుపమ  బర్త్‌ డే సందర్భంగా ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ చిత్ర టీజర్‌ను సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు. అనుపమ సంతోషంగా తన అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లడం లిఫ్ట్‌ ఎక్కే క్రమంలో కొన్ని అనూహ్య దృశ్యాలు ఆమె కంటపడటం.. అక్కడి నుంచి ఆమె జీవితంలో సమస్యలో చిక్కుకోవడం లాంటి సన్నివేశాలతో టీజర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మరి ఆమెకు కనిపించిన ఆ అనూహ్య దృశ్యాలేంటి? ఆమెను వెంటాడుతున్న వ్యక్తులెవరు? బటర్‌ప్లై అనే టైటిల్‌ ఎందుకు పెట్టారు? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి. ఇటు యువతరంతో పాటు అటు కుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించే వైవిధ్యమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం అని  చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి  సంగీతం: అరవింద్‌ షారోన్‌, గిడోన్‌ కట్టా, ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి. రవి ప్రకాష్‌ బోడపాటి, ప్రసాద్‌ తిరువళ్లూరి, ప్రదీప్‌ నల్లివెల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events